‘బాహుబలి’ డిస్ట్రిబ్యూటర్ల చేతికి ‘అర్జున్ రెడ్డి’ !
Published on Jul 25, 2017 6:30 pm IST


యువ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘అర్జున్ రెడ్డి’ అన్ని పనుల్ని పూర్తి చేసుకుని రిలీజుకు సిద్ధమవుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్స్, ట్రైలర్ కు బ్రహ్మాండమైన స్పందన రావడంతో సినిమాపై అందరిలోనూ మంచి క్రేజ్, అంచనాలు నెలకొన్నాయి. డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై నమ్మకం ఏర్పడింది. దీంతో సినిమా హక్కుల కోసం పెద్ద మొత్తంలో చెల్లించేందుకు కొందరు ముందుకొచ్చారు.

చివరికి నైజాంలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ, బాహుబలి వంటి భారీ చిత్రాల్ని డిస్ట్రిబ్యూట్ చేసిన ఏషియన్ ఫిలిమ్స్, కే.ఎఫ్.సి ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి సొంతం చేసుకుని సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేయనుంది. ఈ డీల్ సుమారు రూ.5. 5 కోట్లకు జరిగినట్టు వినికిడి. నూతన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ వంగ నిర్మిస్తుండగా షాలిని హీరోయిన్ గాను విపిఎస్ కళ్యాణ్, జియా శ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి, క‌మ‌ల్ కామ‌రాజు, సంజ‌య్ స్వ‌రూప్‌, కాంచ‌నలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

 
Like us on Facebook