
సూపర్ సక్సెఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న టాలీవుడ్ మోస్ట్ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ ‘బాహుబలి’. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి అన్నదమ్ములుగా కనిపించనున్న ఈ పీరియాడిక్ మూవీలో అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఇటీవలే ఓ షెడ్యూల్ కోసం బల్గేరియా వెళ్ళిన ఈ చిత్ర టీం షూటింగ్ పూర్తి చేసుకొని తిరిగి వచ్చేశారు. అంతే కాకుండా బాహుబలికి ఆస్థానంగా మారిన రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ ని కూడా ప్రారంభించారు.
ప్రస్తుతం ప్రభాస్ మరియు మిల్క్ బ్యూటీ తమన్నాలపై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం చివరి కల్లా షూటింగ్ ని పూర్తి చేసి ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ని 2015 ఏప్రిల్ 17న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. సెకండ పార్ట్ ని కాస్త గ్యాప్ ఇచ్చి రిలీజ్ చెయ్యనున్నారు.
ఆర్కా మీడియా వారు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నారు.