
దిగ్గజ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రాజమౌళి ఈ సినిమా మొదటి భాగాన్ని వేసవిలో మన ముందుకు తీసుకురానున్నాడు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఆర్కా మీడియా వర్క్స్ భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని సమీక్షించడానికి ఆసియా లెవెల్ లో ప్రఖ్యాతి సంపాదించిన ఎడిటర్ జేమ్స్ మార్ష్ ని ప్రత్యేకంగా రామోజీ ఫిలిం సిటీలో సెట్ కి ఆహ్వానించారు. అంతర్జాతీయంగా ప్రాముఖ్యత సాధించిన ఒక మ్యాగ్జీన్ లో ఈ సినిమా పై ఒక ఆర్టికల్ ప్రచురించాడు.
జక్కన్న గతంలో చిత్రీకరించిన ఈగ సినిమా ఫారెన్ లాంగ్వేజ్ లలో విడుదలైంది. బాహుబలి సినిమాని ఇంగ్లీష్ లో బాహుబలి – ది బిగినింగ్ అనే పేరుతొ విడుదలచేయనున్నారు.