
టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అద్భుత సృష్టిగా వచ్చిన విజువల్ వండర్ ‘బాహుబలి’. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో రానా, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. జూలై 10న రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో రికార్డ్ కలెక్షన్స్ ని సృష్టించింది. కేవలం ఇండియాలోనే కాకుండా బాహుబలి ఓవర్సీస్ లో కూడా సుమారు 10 మిలియన్స్ మార్క్ ని క్రాస్ చేసి రికార్డ్స్ సృష్టించింది. బాహుబలి సినిమాని ఓవర్సీస్ లో బ్లూస్కై సినిమాస్ వారు సుమారు 9 కోట్లకి కొన్నారు. బాహుబలి సినిమా ద్వారా బ్లూస్కై సినిమాస్ వారు మంచి లాభాలను అందుకోవడమే కాకుండా ఈ మధ్యకాలంలో ఏ డిస్ట్రిబ్యూటర్ చేయని ఓ రేర్ ఫీట్ కూడా చేసారు.
అదే సినిమా లాంగ్ రన్ ఫినిష్ అయ్యాక లావాదేవీలను చూసుకొని వచ్చిన లాభంలో కొంత భాగాన్ని ఓవర్ ఫ్లో రూపంలో తిరిగి నిర్మాతలకు ఇవ్వడం. ఇక అసలు విషయంలోకి వెళితే.. లాంగ్ రన్ లో బాహుబలికి వచ్చిన లెక్కలను పరిశీలించి, వారి డిస్ట్రిబ్యూషన్, థియేటర్స్ ఖర్చులు అన్నీ పోగా వచ్చిన లాభంలో 4 కోట్ల రూపాయలను బాహుబలి నిర్మాతలైన ఆర్కా మీడియా వారికి బ్లూస్కై వారు అందించారు. ఈ మధ్యకాలంలో డిస్ట్రిబ్యూటర్స్ సినిమా లాంగ్ రన్ ఫైనల్ ప్రాఫిట్స్ వచ్చినా ఏదో ఒక రూపంలో నిర్మాతలకి మస్కా వెయ్యడానికి చూస్తున్నారు. కానీ బ్లూ స్కై మాత్రం దానికి విరుద్దంగా నిర్మాతలకి వచ్చిన లాభంలో షేర్ ఇవ్వడం వారి నిజాయితీకి ప్రతీకగా చెప్పుకోవచ్చు.