
తెలుగు సినిమా దశ, దిశని మార్చిన సినిమాగానే కాకుండా, ఒక్క తెలుగు సినిమా రికార్డ్స్ క్రియేట్ చేయడం మొదలు పెడితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇండియన్ మరియు ఇంటర్నేషనల్ మార్కెట్ కి పరిచయం చేసిన వన్ అండ్ ఓన్లీ మూవీ ‘బాహుబలి’. లోకల్ మరియు ఓవర్సీస్ లో తెలుగు చలన చిత్ర రికార్డులను తిరగ రాస్తున్న భారీ బడ్జెట్ పీరియాడికల్ ఫిల్మ్ ‘బాహుబలి’. ట్రిపుల్ హ్యాట్రిక్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి స్టాంప్ తో వచ్చిన ఈ సినిమా ప్రీమియర్ షోస్ నుంచే ఆల్ టైం రికార్డ్స్ సృష్టించడం మొదలు పెట్టింది. బాహుబలిలో నటించిన ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణల నటనకి మరియు విజువల్ ఎఫెక్ట్స్ కి ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.
బాహుబలి సినిమా నైజాంలో ఇప్పటికే లైఫ్ టైం రికార్డ్స్ ని బ్రేక్ చేసేసే స్టేజ్ కి వచ్చేసింది. మొదటి వీకెండ్ లోనే దాదాపు 13.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఇదిలా ఉంటే మొదటి వారం నైజాంలో సుమారు 18 నుంచి 20 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఆల్ టైం రికార్డు సృష్టించడమే కాకుండా తెలుగు సినిమా ఫుల్ రన్ లో వచ్చిన షేర్ రికార్డ్స్ ని కూడా బద్దలు కొడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నైజాం ఏరియా మొదటి మూడు రోజుల షేర్ వివరాలు..
| వారం | కలెక్షన్స్ (షేర్) |
| శుక్ర వారం | 6.22 కోట్లు |
| శని వారం | 3.55 కోట్లు |
| ఆది వారం | 3.65 కోట్లు |
| మొత్తం | 13.42 కోట్లు |