‘బాహుబలి’ లీకేజ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత !

26th, April 2017 - 01:13:08 PM


యావత్ భారతీయ సినీ ప్రపంచం ‘బాహుబలి – ది కంక్లూజన్’ విడుదల కోసం ఆతురతగా ఎదురుచూస్తోంది. విడుదలకు ఇంకో ఒక్క రోజు మాత్రమే సమయముంది. ఇలాంటి తరుణంలో నిన్న సాయంత్రం నుండి సోషల్ మీడియాలో ఈ సినిమా తాలూకు కొన్ని విజువల్స్ విడుదలై హల్ చల్ చేస్తున్నాయి. సిని మా పైరసీ బారిన పడిందనే మాటలు కూడా వినబడ్డాయి. వీటన్నింటినీ గమనించిన చిత్రం నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ఈరోజు తన ట్విట్టర్ ద్వారా పూర్తి క్లారిటీ ఇచ్చారు.

అదేమిటంటే సినిమాను వివిధ దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు. అక్కడి సెన్సార్ బోర్డులకు సినిమాను ప్రదర్శించడం జరిగింది. అంతేగాని ఇంకెక్కడా సినిమాను ప్రదర్శించలేదు. సినిమా పైరసీ జరగలేదు అన్నారు. దీంతో లీకేజ్ రూమర్లకు చెక్ పడ్డట్టైంది. ఇకపోతే సినిమాను రేపు సాయంత్రం నుండి స్పెషల్ పైడ్ ప్రీమియర్ల రూపంలో పలు చోట్ల ప్రదర్శించనున్నారు.