ప్రపంచవ్యాప్తంగా ‘బాహుబలి-2’ రిలీజవుతున్న థియేటర్లు ఎన్నో తెలుసా?

25th, April 2017 - 11:27:52 AM


‘బాహుబలి-2’ ప్రస్తుతం ప్రతి సినీ అభిమాని నోటి వెంట వినిపిస్తున్న ఒకే ఒక మాట. కేవలం భారతదేశంలోనే కాదు విదేశాల్లో సైతం ఈ చిత్రానికి క్రేజ్ చాలా ఎక్కువగానే ఉంది. ఈ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు చిత్రాన్ని ఏప్రిల్ 28న రికార్డ్ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 9000 థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఒక ఇండియన్ సినిమాకు ఇప్పటి వరకు ఇదే అతి పెద్ద విడుదలని చెప్పొచ్చు.

ఇండియాలో 6500 స్క్రీన్లలో రిలీజవుతున్న ఈ సినిమాను తెలుగు చిత్రాలకు ముఖ్యమైన మార్కెట్ గా మారిన యూఎస్ లో 1100, ఇతర దేశాలన్నింటిలో కలిపి 1400 స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. ఈ భారీ విడుదలతో ఈ చిత్రం వసూళ్ళలో ప్రపంచస్థాయి రికార్డుల్ని క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇకపోతే ఈ చిత్రం ఐమ్యాక్స్ ఫార్మాట్లో ప్రదర్శింపబడుతున్న మూడువ భారతీయ చిత్రం కాగా మొట్ట మొదటి దక్షిణ భారతీయ చిత్రం కావడం విశేషం.