ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన ‘బాహుబలి’ !


తెలుగు సినిమా ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తి చేసిన చిత్రం ‘బాహుబలి-2’ 50 రోజుల రన్ ను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇప్పటికే కలెక్షన్ల పరంగా నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1076 స్క్రీన్లలో అర్థ శతదినోత్సవం పూర్తి చేసుకుని మరే భారతీయ చిత్రానికి సాధ్యం కాని ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది.

అత్యధికంగా తెలుగు రాష్ట్రాలైన ఏపి, తెలంగాణాల్లో 281 స్క్రీన్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ముంబైలో 179, కేరళలో 102, తమిళనాడులో 120, కర్ణాటకలో 54, వెస్ట్ బెంగాల్ లో 45 అలాగే ఓవర్సీస్లో 25 కలిపి మొత్తంగా దాదాపు 1076 స్క్రీన్లలో ఫిఫ్టీ డేస్ రన్ పూర్తిచేసుకుంది. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ తో నిర్మాణ పరంగా ఒక్క తెలుగు పరిశ్రమలో మాత్రమే కాక యావత్ భారతీయ చిత్ర రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి.