తమిళనాడులో కూడా రూ. 100 కోట్లకు చేరువైన ‘బాహుబలి’ !


‘బాహుబలి-2’ చిత్రం తెలుగు రాష్ట్రాలతో సమానంగా ఇతర భాషల్లో సైతం కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. సినిమాపై ఉన్న భారీ అంచనాలు, అద్భుతమైన చిత్రీకరణ కారణంగా భాషా బేధం లేకుండా ప్రేక్షకులు సినిమాను విశేషంగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో చిత్ర వసూళ్లు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మొదటి రోజు మార్కింగ్ షోలు మిస్సైనా కూడా తర్వాతి షోలు బ్రహ్మాండమైన స్పంద దక్కించుకోవడంతో ఇప్పటికీ సినిమా చాల చోట్ల హౌజ్ కలెక్షన్లను రాబడుతోంది.

మొదటి మొదటి మూడు రోజులకు రూ. 30 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా మొత్తం 10 రోజులకు కలిపి రూ. 80 కోట్ల పైగానే వసూలు చేసింది. ఇక 11, 12, 13వ రోజుల్లో కూడా అదే హవా కొనసాగించి మూడు రోజుల్లో మరో 10 కోట్లు వసూలు చేసి మొత్తంగా రూ. 90 కోట్ల గ్రాస్ మార్క్ చేరుకొని త్వరలో రూ. 100 కోట్లు కూడా అందుకోవచ్చనే సంకేతాలు అందిస్తోంది.