తెలుగు రాష్ట్రాల్లో రూ. 150 కోట్ల మార్కును అందుకున్న ‘బాహుబలి-2’ !


‘బాహుబలి-2’ చిత్రానికి తెలుగు ప్రజల ఆదరణ ఏ స్థాయిలో వేరే చెప్పనక్కర్లేదు. కేవలం మొదటి 10 రోజులకే తెలుగు రాష్ట్రాల్లో చిత్రం రూ. 139. 70 కోట్ల షేర్ ను వసూలు చేసింది. దీంతో అప్పటి వరకు ఉన్న పాత రికార్డులన్నీ చిరిగిపోయి బాహుబలి పేరిట కొట్ర్టా చరిత్ర నమోదైంది. ఇక 11, 12వ రోజుల్లో కూడా సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది.

12 రోజులకు గాను ఏరియాల వారీగా లెక్కలు చూసుకుంటే అత్యధికంగా నైజాంలో రూ. 50. 10 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, సీడెడ్లో రూ. 26. 37 కోట్లు, నెల్లూరులో రూ. 5. 65 కోట్లు, గుంటూరులో రూ. 14. 20 కోట్లు, కృష్ణాలో రూ. 10. 72 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 10. 34 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 14. 06 కోట్లు, ఉత్తరాంధ్రలో 19. 92 కోట్లు కలిపి మొత్తంగా రూ.151. 36 కోట్లు వసూలు చేసింది. దీంతో రెండు వారాలు కూడా పూర్తిగా గడవక ముందే రూ. 150 కోట్ల షేర్ దాటిన తొలి చిత్రంగా ఈ సినిమా సరికొత్త రికార్డ్ సృష్టించింది.