బాలీవుడ్ ను షేక్ చేస్తోన్న తెలుగు సినిమా !


రాజమౌళి, ప్రభాస్ ల కాంబినేషన్లో రూపొందిన ‘బాహుబలి-ది కంక్లూజన్’ చిత్రం గత నెల 28న విడుదలై ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ స్టామినాకి అన్ని పరిశ్రమల రికార్డులు చెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ సినీ పరిశ్రమ అయితే బాహుబలి దెబ్బకి షేకైపోతోంది. ఇప్పటి వరకు బాలీవడు స్టార్ హీరోలైన అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ ల సినిమాల పేరిట ఉన్న పాత రికార్డులన్నీ బాహుబలి దెబ్బకి కనుమరుగైపోయాయి.

విడుదలైన పది రోజులకే ఈ సినిమా యొక్క హిందీ వెర్షన్ రూ. 300 కోట్ల నెట్ ను రాబట్టి అత్యంత వేగంగా 300 కోట్ల క్లబ్ ను చేరుకున్న మొదటి సినిమాగా చరిత్ర సృష్టించింది. గతంలో ‘సుల్తాన్, పీకే, దంగల్, బజరంగీ భాయ్ జాన్’ వంటి సినిమాలు లాంగ్ రన్లో మాత్రమే ఈ 300 కోట్ల మార్కును అందుకోగలిగాయి. అంతేగాక బాహుబలి లాంగ్ రన్లో సృష్టించబోయే రికార్డులు కూడా ఇన్నాళ్లు ఇండియన్ బాక్సాఫీస్ రారాజులుగా వెలిగిపోయిన బాలీవుడ్ స్టార్ హీరోలకు సరికొత్త సవాళ్లను విసరనున్నాయి.