కేరళలో ‘బాహుబలి’ హవా మామూలుగా లేదు !

4th, May 2017 - 08:54:37 AM


జక్కన్న రాజమౌళి చెక్కిన అద్భుత శిల్పం ‘బాహుబలి – ది కంక్లూజన్’ విడుదలైన అన్ని భాషల్లో ఘన విజయం సొంతం చేసుకుంది. ఆయన భాషా పరిశ్రమల్లో అప్పటి వరకు ఉన్న అన్ని పాత రికార్డుల్ని బద్దలుకొట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. కేరళలో అయితే ఏ తెలుగు సినిమా దక్కించుకోని ఆదరణను ఈ సినిమా దక్కించుకుంది. నిన్నటి వరకు చూసుకుంటే ఈ చిత్రం కేరళ రాష్ట్రంలో సుమారు రూ. 30 కోట్ల పై చిలుకు గ్రాస్ ను వసూలు చేసింది.

దీంతో వసూళ్ల పరంగా స్థానిక సినిమాల సరసన టాప్ 10 జాబితాలో నిలబడిందీ చిత్రం. ఇకపోతే తెలుగులో 5 రోజులకు గాను రూ . 100 కోట్ల షేర్ మార్కును అందుకున్న ఈ సినిమా హిందీలో కూడా ఐదు రోజులకు కలిపి రూ. 200 కోట్లకు చేరువలోకి వెళ్ళింది. అంతేగాక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 5 రోజులకు గాను ఈ సినిమా గ్రాస్ రూ. 700 కోట్లకు చేరింది. ఇలా విడుదలై వారాం కూడా గడవక ముందే ఇన్ని రికార్డుల్ని సాధించిన ఈ సినిమా లాంగ్ రన్లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.