20 మిలియన్ డాలర్ల దిశగా ‘బాహుబలి’ !

21st, May 2017 - 06:15:42 PM


‘బాహుబలి-2’ చిత్రం ఓవర్సీస్ బాక్సాఫీసును కుదిపేస్తోంది. ఇప్పటికే యూఎస్ లో మారె ఇండియన్ సినిమా అందుకోలేని వసూళ్లను అందుకున్న ఈ చిత్రం వారం తక్కువ నెల గడుస్తున్నా అదే క్రేజ్ తో నడుస్తోంది. తాజాగా తెలుస్తున్న ట్రేడ్ సమాచారం ప్రకారం శుక్రవారం, శనివారం కలిపి ఈ చిత్రం 4 లక్షల డాలర్లను రాబట్టింది.

దీంతో మొత్తం నిన్నటి వరకు ఈ చిత్రం 19.92 మిలియన్ల డాలర్లను అందుకుంది. ఇక ఈరోజు ఆదివారం వసూళ్లను కూడా కలుపుకుంటే ఈ మొత్తం 20 మిలియన్ డాలర్ల మ్యాజికల్ ఫిగర్ ను దాటిపోనుంది. ఇక ఇతర దేశాలైన మలేషియా, యూకే, యూఏఇ, ఆస్ట్రేలియాల్లో కూడా ఈ చిత్ర కలెక్షన్లు బాగానే నడుస్తున్నాయి. ఇలా వసూళ్ల పరంగా సరికొత్త లెక్కల్ని నమోదు చేసిన ఈ చిత్రం త్వరలో విడుదల కాబోయే భారీ భారతీయ చిత్రాలకు కొత్త టార్గెట్ ఫిక్స్ చేసింది.