షూటింగ్ మానేసి క్రికెట్ ఆడుకుంటున్న ‘బాహుబలి’ టీమ్

30th, August 2016 - 11:16:04 AM

baahubali
తెలుగు పరిశ్రమకు ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘బాహుబలి- ది కన్ క్లూజన్’ ను దర్శకుడు రాజమౌళి హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా ఈరోజు వాటి చిత్రీకరణకు ఆఖరిరోజు. కానీ అకస్మాత్తుగా హైదరాబాద్ లో ఈరోజు ఉదయం వర్షం కురవడంతో షూటింగ్ స్పాట్ మొత్తం నీటితో నిండిపోయి షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది.

ఇదే విషయాన్ని రాజమౌళి తెలుపుతా ‘ఈరోజు యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ ఆఖరిరోజు. కానీ వర్షం వల్ల షూటింగ్ స్పాట్ తడిచిపోయి చిత్రీకరణ ఆగిపోయింది. యూనిట్ తడిసిన షూటింగ్ స్పాట్ ను క్రికెట్ ఆడుకోవడానికి వాడుకుంటున్నారు’ అంటూ ట్వీట్ వేసి వాళ్ళు క్రికెట్ ఆడే వీడియోను కూడా దానికి యాడ్ చేశారు. ఇకపోతే ఈ చిత్రాన్ని 2017 ఏప్రిల్ 28న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.