రజనీ రికార్డుని బ్రేక్ చేసే దిశగా ‘బాహుబలి-2’ !

రజనీ రికార్డుని బ్రేక్ చేసే దిశగా ‘బాహుబలి-2’ !

Published on May 8, 2017 12:30 PM IST


‘బాహుబలి – ది కంక్లూజన్’ చిత్రం యొక్క కలెక్షన్లు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సినీ పరిశ్రమల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమలో ఉన్న అన్ని పాత రికార్డుల్ని చెరిపేసిన ఈ సినిమా తమిళ పరిశ్రమలోని స్టార్ హీరోల పేరిట ఉన్న పలు రికార్డుల్ని దాటేసి త్వరలో తలైవర్ రజనీకాంత్ పేరిట ఉన్న ఆల్ టైమ్ టాప్ గ్రాసర్ ఇన్ తమిళనాడు ఘనతను కూడా సొంతం చేసుకోనుంది.

మొదటి మూడు రోజులకు రూ. 30 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా మొత్తం 10 రోజులకు కలిపి రూ. 80 కోట్ల పైగానే వసూలు చేసింది. ఈ లెక్కలతో తమిళనాడులో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రాలుగా ఉన్న ‘వేదాళం, కబాలి, తేరి’ లను బాహుబలి అధిగమించి అన్నిటికన్నా మొదటి స్థానంలో ఉన్న రజనీకాంత్ ‘రోబో’ ను సమీపించింది. ఇంకొన్ని రోజుల్లో ఆ రికార్డును కూడా బాహుబలి ఎలాంటి ఇబ్బందీ లేకుండా బ్రేక్ చేస్తుందని తమిళ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక్కడ విశేషమేమిటంటే ఈ చిత్రానికి విడుదలైన రోజు కంటే కూడా ప్రస్తుతం వస్తున్న వసూళ్లే మెరుగ్గా ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు