ఏపి, తెలంగాణాల్లో ‘బాహుబలి-2’ ఫస్ట్ వీక్ కలెక్షన్లు !


భారీ అంచనాల నడుమ గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 8000ల స్క్రీన్లలో విడుదలైన ‘బాహుబలి-ది కంక్లూజన్’ చిత్రం దిగ్విజయంగా నడుస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 700 కోట్ల పైగానే గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా కనీవినీ ఎరుగని రీతిలో వసూళ్లను రాబడుతోంది. నిన్న గురువారంతో వారం రోజుల రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రూ. 117. 13 కోట్ల షేర్ ను రాబట్టింది.

ఏరియాల వారీగా చూసుకుంటే నైజంగాలో రూ. 35.39 కోట్లు, సీడెడ్లో రూ. 20. 45 కోట్లు, నెల్లూరులో రూ. 4. 57 కోట్లు, గుంటూరులో రూ. 11. 95 కోట్లు, కృష్ణాలో రూ. 8. 39 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 9. 29 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 11. 97 కోట్లు, ఉత్తరాంధ్రలో 15. 12 కోట్లు వసూలుచేసింది.