‘బాహుబలి-2’ ఏపి, తెలంగాణ లేటెస్ట్ కలెక్షన్స్ !


గత నెల 28న విడుదలైన ‘బాహుబలి-2’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దిగ్విజయంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. వసూళ్ల పరంగా ఈ చిత్రం రోజుకో కొత్త రికార్డును నెలకొల్పుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రేక్షకులు ఈ చిత్రానికి కాసుల వర్షం కురిపిస్తున్నారు. ప్రదర్శితమవుతున్న అన్ని థియేటర్లు దాదాపు హౌజ్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నాయి. దీంతో 5 రోజులకే రూ. 100 కోట్ల షేర్ ను దక్కించుకున్న ఈ చిత్రం 6వ రోజు కూడా అదే జోరును కొనసాగించింది.

ఆరు రోజులకు గాను నైజాం ఏరియాలో రూ. 32.09 కోట్లు రాబట్టిన ఈ చిత్రం ఇతర ప్రాంతాలైన సీడెడ్లో రూ. 19. 05 కోట్లు, నెల్లూరులో రూ. 4. 33 కోట్లు, గుంటూరులో రూ. 11. 44 కోట్లు, కృష్ణాలో రూ. 7. 87 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 9. 01 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 11. 45 కోట్లు, ఉత్తరాంధ్రలో 14. 05 కోట్లు వసూలు చేసి మొత్తంగా రూ. 109. 29 కోట్ల షేర్ ను తన ఖాతాలో వేసుకుంది.