తమన్నా “బాక్” రన్ టైమ్ లాక్డ్?

అరణ్మనై 4 (తమిళం) చిత్రం తెలుగు లో బాక్ అనే టైటిల్ తో మే 3, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది. ఈ హార్రర్ కామెడీ ఎంటర్టైనర్ లో తమన్నా భాటియా, రాశి ఖన్నా, సుందర్ సి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం కూడా వహించాడు. రీసెంట్ గా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఎ సర్టిఫికెట్ పొందింది. బజ్ ఏమిటంటే, సినిమా మొత్తం రన్‌టైమ్ దాదాపు 148 నిమిషాలకు దగ్గరగా ఉంది. అంటే 2 గంటల 28 నిమిషాలు.

రన్ టైం పై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వెన్నెల కిషోర్, సునీల్, యోగి బాబు, శ్రీనివాస రెడ్డి, కెఎస్ రవి కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సుందర్ భార్య ఖుష్భు సుందర్ మరియు ACS అరుణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Exit mobile version