లేటెస్ట్ వీడియో : ‘వీరసింహా రెడ్డి’ మిస్ అవ్వొద్దు అంటున్న బాలయ్య

Published on Feb 22, 2023 2:35 am IST


నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్, హానీ రోజ్ హీరోయిన్స్ గా తెరకెక్కిన లేటెస్ట్ సక్సెస్ఫుల్ సూపర్ హిట్ మూవీ వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ మూవీలో దునియా విజయ్ విలన్ గా కనిపించగా ఎస్ థమన్ సంగీతం అందించారు. మాస్ యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ వ్యయంతో నిర్మించారు.

బాలకృష్ణ కెరీర్ లో పెద్ద సక్సెస్ అందుకున్న వీరసింహారెడ్డి మూవీ ఫిబ్రవరి 23న సాయంత్రం 6 గం. ల నుండి ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీ హాట్ స్టార్ ద్వారా బుల్లితెర ఆడియన్స్ ముందుకి రానుంది. కాగా తన కెరీర్ లో పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న వీరసింహారెడ్డి మూవీని డిస్నీ హాట్ స్టార్ లో మిస్ కావొద్దు అంటూ ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఉద్దేశించి బాలకృష్ణ అందించిన లేటెస్ట్ వీడియో బైట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరి థియేటర్స్ లో సక్సెస్ అయిన ఈ మూవీ ఓటిటిలో ఆడియన్స్ ని ఎంత మేర అలరిస్తుందో చూడాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం :