‘బాబు బంగారం’ కృష్ణా జిల్లా కలెక్షన్స్!

babu-bangaram
వెంకటేష్ హీరోగా నటించిన ‘బాబు బంగారం’ సినిమా భారీ ఎత్తున గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పట్నుంచో మంచి ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే సినిమాకు మొదటి రోజు అన్ని ప్రాంతాల్లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా వెంకటేష్ నాటితరం సినిమా స్థాయి కామెడీ ఈజ్ బ్యాక్ అంటూ ప్రచారం తెచ్చుకోవడం సినిమాకు కలిసి వచ్చింది.

కృష్ణా జిల్లాలో మొదటి వీకెండ్ పూర్తయ్యే సరికి ‘బాబు బంగారం’ సినిమా సుమారు 87 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ ప్రాంతానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కులు వెంకటేష్ కెరీర్లోనే హయ్యస్ట్‌గా 2.2 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. ఇక వెంకటేష్ జాలి కామెడీ మేజర్ హైలైట్‌గా నిలిచిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించారు.