‘బాబు బంగారం’ యూఎస్ కలెక్షన్స్
Published on Aug 15, 2016 12:48 pm IST

babu-bangaram
వెంకటేష్ హీరోగా నటించిన ‘బాబు బంగారం’ సినిమా భారీ ఎత్తున గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పట్నుంచో మంచి ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే సినిమాకు మొదటి రోజు అన్ని ప్రాంతాల్లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా వెంకటేష్ నాటితరం సినిమా స్థాయి కామెడీ ఈజ్ బ్యాక్ అంటూ ప్రచారం తెచ్చుకోవడంతో ఈ సినిమాకు యూఎస్ బాక్సాఫీస్ వద్ద మంచి క్రేజ్ కనిపించింది.

ప్రీమియర్ షోస్‌తో యూఎస్‌లో 177 కే డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా శనివారం పూర్తయ్యేసరికి 360కే డాలర్లు (సుమారు 2.41 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. వెంకటేష్ సోలో హీరోగా చేసిన సినిమాల్లో యూఎస్ బాక్సాఫీస్ ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌గా చెప్పుకోవచ్చు. వెంకటేష్ జాలి కామెడీ మేజర్ హైలైట్‌గా నిలిచిన ఈ సినిమకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి కలెక్షన్సే ఉన్నాయి. వెంకటేష్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది.

 
Like us on Facebook