మొత్తానికి రామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద సినిమాలను అలాగే కంటిన్యూ చేస్తూ.. తెరకెక్కిస్తోన్న ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా నుండి తాజాగా ‘బాబు చంపేస్తాడు’ అనే వీడియో లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. వర్మ తన ట్విట్టర్ ద్వారా ఈ సాంగ్ ని రిలీజ్ చేశాడు. ఎప్పటిలాగే ఈ వీడియోలో డైరెక్ట్ గా నాయకుల ఫోటోలను పెట్టి.. బాబు చంపేస్తాడు అంటూ వివాదాస్పదమైన పదాలతో ఓ నాయకుడిని బాగా టార్గెట్ చేశాడు. కులాల్ని బేస్ చేసుకుని ఉండనున్న ఈ ప్రాజెక్ట్ పట్ల మొదట్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా వర్మ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు.
ఇప్పటీకే సినిమా చిత్రీకరణను శరవేగంగా జరుపుతున్నారు. ఇటివలే ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఆ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లోని వ్యక్తి చంద్రబాబు వేషధారణలో ఉండటంతో టీడీపీ కార్యకర్తలు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయారు. ఏమైనా సినిమా పేరుతోనే రెండు ప్రధాన సామాజిక వర్గాల నడుమ జరిగే రాజకీయ పోరునే వర్మ సినిమాగా తీస్తున్నాడట. అసలు టైటిలే వివాదాస్పదంగా ఉందనుకుంటే.. సాంగ్ అంతకన్నా వివాదాస్పదంగా సాగింది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
