మ్యూజిక్ లవర్స్ ని అమితంగా ఇంప్రెస్ చేసిన “బేబీ” ఫస్ట్ సింగిల్.!

మ్యూజిక్ లవర్స్ ని అమితంగా ఇంప్రెస్ చేసిన “బేబీ” ఫస్ట్ సింగిల్.!

Published on Dec 28, 2022 3:47 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా టాలెంటెడ్ యంగ్ నటి వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చిత్రం “బేబీ”. నేషనల్ అవార్డు విన్నింగ్ “కలర్ ఫోటో” చిత్రానికి కథని అందించిన దర్శకుడు సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు మ్యూజిక్ లవర్స్ ని అయితే కట్టి పడేస్తుంది.

గత కొన్ని రోజులు కితం వచ్చిన ఈ సినిమా ఫస్ట్ సింగిల్ “ఓ రెండు ప్రేమ మేఘాలిలా” రిలీజ్ అయ్యి యూట్యూబ్ సహా ఇతర మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్ లో కూడా అదిరే రెస్పాన్స్ తో టాప్ 5 లో నిలిచి కొనసాగుతుంది. మొట్ట మొదటిసారి విన్న వెంటనే నచ్చే విధంగా సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ ఇచ్చిన ట్యూన్ ఇన్ స్టెంట్ చార్ట్ బస్టర్ అయ్యింది.

ఈ సాంగ్ లో ఫీల్ తో పాటుగా పిల్లల కోరస్ మరియు ప్రముఖ సింగర్ శ్రీరామ చంద్ర ఆలపించడం హైలైట్ అయ్యాయి. మరి ప్రస్తుతం ఈ సాంగ్ 3 మిలియన్ కి పైగా వ్యూస్ తో అయితే యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఇక ఈ చిత్రాన్ని అయితే ప్రముఖ దర్శకుడు మారుతీ మరియు నిర్మాత ఎస్ కె ఎన్ లు సంయుక్తంగా నిర్మాణం వహిస్తుండగా ఈ సినిమా విషయంలో మాత్రం వారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అలాగే అతి త్వరలోనే సినిమాని మంచి ప్లాన్ చేసి రిలీజ్ చేయనున్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు