
‘సాహసం’ సినిమా తర్వాత తాప్సి తెలుగులో మరొక సినిమాలో నటించలేదు. ఇతర భాషలలో కూడా ఆమె నటించిన సినిమాలు విడుదలై ఏడాది దాటింది. తాప్సి నటించిన రెండు తమిళ సినిమాలు, ఓ హిందీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. త్వరలో విడుదల కానున్నాయి. ప్రస్తుతం తాప్సి ఒకే ఒక్క సినిమాలో నటిస్తుంది. ఒకప్పుడు వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేసిన తాప్సి తన రూట్ మార్చింది.
‘ఎన్ని సినిమాలలో నటించాం అన్నది ముఖ్యం కాదు, మంచి సినిమాలలో నటించడం ముఖ్యం. నేను చేసే పాత్రకు ప్రాధాన్యత ఉండాలి.’ అనే ఫిలాసఫి ఫాలో అవుతుంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ సరసన నటిస్తున్న ‘బేబీ’ సినిమా తన కెరీర్ కు బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుందని చెప్తుంది. ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయడం కంటే ‘బేబీ’ లాంటి సినిమా ఒక్కటి చేసినా చాలు అంటుంది. ఈ సినిమా తన కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుందని అమ్మడు చాలా ఆశలు పెట్టుకుంది.