హీరో రవితేజ చేతుల మీదుగా చోర్ బజార్ మూవీ బచ్చన్ సాంగ్..!

హీరో రవితేజ చేతుల మీదుగా చోర్ బజార్ మూవీ బచ్చన్ సాంగ్..!

Published on Jun 15, 2022 2:08 AM IST

టాలెంటెడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ పూరి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’. ఈ చిత్రంలో గెహన సిప్పీ కథానాయికగా నటించింది. ‘దళం’, ‘జార్జ్ రెడ్డి’ సినిమాలతో టాలీవుడ్ లో తనదైన మార్క్ ను క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 24న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

అయితే నేడు ఈ సినిమాలోని బచ్చన్ సాబ్ అంతెం సాంగ్‌ని మాస్ మహరాజ్ రవితేజ చేతుల మీదుగా విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఐవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత వీఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లూరి సురేశ్ వర్మ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు