‘దృశ్యం 2’ నుంచి బ్యాడ్ న్యూస్..అప్డేట్ వాయిదా.!

Published on Sep 20, 2021 10:46 am IST


విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాల్లో మరో మోస్ట్ అవైటెడ్ చిత్రం “దృశ్యం 2”. మళయాళ బ్లాక్ బస్టర్ దృశ్యం 2 కి రీమేక్ గా అదే దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలోనే తెలుగులో కూడా తెరకెక్కించిన ఈ చిత్రం ఎప్పుడు నుంచి వెంకీ మామ అభిమానులను ఊరిస్తూ వస్తుంది. మరి దీనితో పాటుగా మేకర్స్ ఈరోజు సెప్టెంబర్ 20న ఆసక్తికర ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

మరి దీనిపైనే వారు ఓ బ్యాడ్ న్యూస్ ని వెల్లడించారు. “కొన్ని అనుకోని ఊహించని పరిణామాల రీత్యా ఈరోజు రిలీజ్ చేస్తామన్న దృశ్యం 2 ఫస్ట్ లుక్ పోస్టర్ ని వాయిదా వేస్తున్నామని, ఈ అసౌకర్యానికి చింతున్నామని” అభిమానులకు సారీ చెప్పారు. మరి ఈ అప్డేట్ ఎప్పుడు వస్తుందో అన్నది చూడాలి. ఇక ఈ చిత్రంలో మీనా, ఎస్తర్ అనీల్ తదితరులు నటించగా సురేష్ ప్రొడక్షన్స్ మరియు ఆశీర్వాద్ సినిమాస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :