బాలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేసిన బాద్షా షారుఖ్.!

Published on Jan 27, 2023 12:00 am IST


బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నుంచి ఓ సాలిడ్ కం బ్యాక్ కోరుకుంటున్న అభిమానులు అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఓ మాసివ్ హిట్ కోసం చూస్తున్న తరుణంలో వచ్చిన లేటెస్ట్ చిత్రమే “పఠాన్”. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ నిన్ననే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి భారీ మొత్తం వసూళ్లు మొదటి రోజు వరల్డ్ వైడ్ గా నమోదు చేసింది. ఇక ఈ చిత్రం అయితే బాలీవుడ్ లో కూడా రికార్డు బ్రేకింగ్ నంబర్స్ సెట్ చేసినట్టుగా తెలుస్తుంది.

ఇది వరకు లోన్లు హిందీ వెర్షన్ లో అయితే వార్ మరియు కేజీయఫ్ 2 చిత్రాలు ఆల్ టైం రికార్డ్స్ తో నెంబర్ 1 మరియు 2 స్థానాల్లో ఉండగా కేజీయఫ్ 2 చిత్రం పేరిట 53.95 కోట్ల గ్రాస్ మార్క్ ని పఠాన్ మొదటి రోజు 55 కోట్ల భారీ మార్క్ తో క్రాస్ చేసి బాలీవుడ్ హిస్టరీ లో సరికొత్త రికార్డు సృష్టించింది. దీనితో పఠాన్ ఏ రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ భారీ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించగా యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :