అతిధి దేవోభవ నుండి రేపు విడుదల కానున్న “బాగుంటుంది నువ్వు నవ్వితే” సాంగ్

Published on Sep 26, 2021 9:42 pm IST

ఆది సాయి కుమార్ హీరోగా, నువేక్ష హీరోయిన్ గా పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం అతిధి దేవోభవ. ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్ ఇటీవల విడుదల అయి అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం నుండి ఒక పాటను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దమైంది. బాగుంటుంది నువ్వు నవ్వితే అనే పాటను రేపు ఉదయం 11:30 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించడం జరిగింది. ఈ పాటను భాస్కర భట్ల రాయగా, సిద్ శ్రీరామ్ మరియు నూతన మోహన్ పాడినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :