ధరమ్ తేజ్ కోసం ‘బాహుబలి’ ఎక్స్ పర్ట్ !

2nd, December 2016 - 08:35:16 AM

saidharamtej
మెగాహీరో సాయిధరమ్ చేస్తున్న తాజా చిత్రం ‘విన్నర్’. ఇటీవలే ఉక్రెయిన్, ఇస్తాంబుల్ వంటి దేశాల్లో మెజార్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్ర యూనిట్ త్వరలో బెంగుళూరు, ఊటీల్లో కొత్త షెడ్యూల్ ను ప్రారంభించనుంది. అయితే విదేశాల్లో షూటిజరుపుకునే సమయంలో ధరమ్ తేజ్ – రకుల్ ప్రీత్ లపై ఒక పాటను, ధరమ్ తేజ్ – అనసూయలపై మరొక స్పెషల్ పాటను చిత్రీకరించిన టీమ్ ఇస్తాంబుల్ లోనే సినిమా క్లైమాక్స్ లో వచ్చే హెవీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించింది.

కీలక సమయంలో వచ్చే ఈ యాక్షన్ సన్నివేశాల్ని ప్రత్యేకంగా చిత్రీకరించారట. దీని కోసం ‘బాహుబలి’ వంటి భారీ ప్రతిష్టాత్మక చిత్రానికి పని చేసిన యాక్షన్ కొరియోగ్రఫర్ రఫెర్ కలియెన్ చేత యాక్షన్ సన్నివేశాలు రూపొందించారట. ఇతను ‘బాహౌబలి’ మొదటి పార్ట్ లో మంచు కొండల్లో జరిగే పోరాట సన్నివేశాల్ని రూపొందించారు. అవి ఎంతగా పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 24న మహాశివరాత్రి కానుకగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని గోపిచంద్ మలినేని డైరెక్షన్లో ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.