“బాహుబలి” బాలీవుడ్ సినిమా కాదు..వారిపై సెంథిల్ అసహనం.!

Published on Aug 13, 2021 7:18 pm IST

దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తీసిన భారీ చిత్రం బాహుబలి సిరీస్ దేశ వ్యాప్తంగా కూడా ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. అంతే కాకుండా ఖండాంతరాల్లో కూడా ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని అలాగే భారతదేశ సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లింది.

అయితే ఇప్పటి వరకు కూడా ఎన్నో దేశాల్లో ఆయా భాషల్లో విడుదల అయ్యి తెలుగు సినిమా పేరుని మారుమోగిస్తున్న ఈ చిత్రం తాజాగా మంగోలియా దేశంలో విడుదల అయ్యింది. అయితే ఇక్కడే చిన్న స్పర్థ ఏర్పడింది. ఈరోజు బాహుబలి 2 చిత్రం అక్కడ రిలీజ్ అవుతుండగా వారు బాహుబలి సినిమాని ఒక బాలీవుడ్ చిత్రం అని దాని డబ్బింగ్ వెర్షన్ ఇప్పుడు ఇక్కడ విడుదల అవుతుంది అని తెలిపారు.

దీనితో ఈ చిత్రానికి ఇప్పుడు రాజమౌళి చేస్తున్న మరో భారీ చిత్రం “RRR” కి తన అద్భుత కెమెరా వర్క్ అందించిన సెంథిల్ కుమార్ స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశారు. “బాహుబలి సినిమా బాలీవుడ్ సినిమా కాదు. అది మంగోలియన్ భాషలో డబ్ అయిన ఇండియన్ సినిమా లేదా తెలుగు సినిమా మాత్రమే. ఈ సినిమా అక్కడ విడుదల అవ్వడం సంతోషంగా ఉంది” అని కాస్త ఘాటుగానే వారికి రిప్లై ఇచ్చారు.

సంబంధిత సమాచారం :