“బలగం” సక్సెస్..పల్లెల నుంచి తరలి వస్తున్న ప్రేక్షకులు.!

Published on Mar 12, 2023 2:04 pm IST

లేటెస్ట్ గా టాలీవుడ్ లో వచ్చి ఆడియెన్స్ ని ఎంతగానో మెప్పించిన చిత్రం “బలగం”. ప్రముఖ కమెడియన్ వేణు టిల్లు దర్శకునిగా పరిచయం అయ్యి చేసిన ఈ చిత్రంలో టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించారు. మరి ఈ చిత్రం అయితే ఇప్పుడు రెండో వారాంతానికి వచ్చినప్పటికీ కూడా థియేటర్స్ లో స్ట్రాంగ్ రన్ ని అయితే కొనసాగిస్తోంది. ఇక నిన్ననే మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమా యూనిట్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేయడం మరింత ఆసక్తిగా మారింది.

ఇక ఈ సినిమా సక్సెస్ ఏ రేంజ్ లో ఉందో లేటెస్ట్ గా ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ని హీరో ప్రియదర్శి షేర్ చేసుకున్నాడు. ఈ చిత్రాన్ని థియేటర్స్ లో వీక్షించేందుకు దారిపల్లి గ్రామస్తులు నిజామాబాద్ లోని థియేటర్స్ లో చూసేందుకు స్పెషల్ గా బస్సు కట్టించుకొని మరీ వచ్చారు. దీనితో ఇది షేర్ చేసుకొని ప్రియదర్శి ఇది ప్రేమ కాకపోతే ఇంకేంటి అంటూ ఆ గ్రామస్తులకు తన ధన్యవాదాలు తెలియజేసాడు. ఇంత ప్రేమను అందుకోడానికి అయితే ఈ చిత్రం తగినదే అని చెప్పడంలో సందేహమే లేదు.

సంబంధిత సమాచారం :