సాలిడ్ టీఆర్పీ రేటింగ్ రాబట్టిన “బలగం”

సాలిడ్ టీఆర్పీ రేటింగ్ రాబట్టిన “బలగం”

Published on May 18, 2023 5:00 PM IST


టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటుడు వేణు ఎల్డండి దర్శకత్వంలో తెరకెక్కిన విలేజ్ కామెడీ డ్రామా బలగం. ఈ మూవీ థియేటర్ల లో సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా కూడా ఓటిటి లో సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల ఈ సినిమా స్టార్ మా లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ ప్రీమియర్ కి సంబందించిన టీఆర్పీ రేటింగ్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి 14.3 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. పలు అంతర్జాతీయ అవార్డులను కూడా గెలుచుకున్న ఈ చిత్రం అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు