“బలగం” ఈ మ్యాజికల్ రన్ ని సెట్ చేస్తుందా?

Published on Mar 24, 2023 11:00 pm IST

యంగ్ అండ్ ప్రామిసింగ్ నటుడు ప్రియదర్శి హీరోగా బ్యూటిఫుల్ నటి కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ సినిమా “బలగం”. దాదాపు మూడు వారాలు పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు తో లాభాలు అందుకొని ఇప్పటికీ స్ట్రాంగ్ గా దూసుకెళ్తున్న ఈ సినిమా సడెన్ అనౌన్సమెంట్ అయితే ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

మరి ఈ సినిమా అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో మూడు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండగా ఇప్పుడు అసలు ప్రశ్న లేవనెత్తుతుంది. చాలా సినిమాలు ఇలానే థియేటర్స్ లో సూపర్ గా రన్ అవుతున్నప్పటికీ ఓటిటిలో వచ్చాయి అయినా కూడా ఆ సినిమాలు థియేటర్స్ లోనీ అదరగోట్టాయి. మరి ఈ మ్యాజికల్ రన్ ని అయితే బలగం కూడా రిపీట్ చేస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరి ఈ రెండు రోజులు గనుక మునుపటి లాంటి సాలిడ్ వసూళ్లే రాబడితే బలగం ని థియేటర్స్ సక్సెస్ నుంచి ఓటిటి ఆపనట్టే చెప్పుకోవాలి.

సంబంధిత సమాచారం :