రాయలసీమ – కర్ణాటక బోర్డర్ లో బాలయ్య కొత్త సినిమా?

Published on Sep 21, 2021 2:40 pm IST


నట సింహం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ లో చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా గోపీచంద్ మలినేని బాలయ్యకి ఈ సినిమా కథ మొత్తం వినిపించాడని, కథను బాలయ్య ఓకే చేసాడని తెలుస్తోంది. కథలో ఫుల్ యాక్షన్ తో పాటు ఓ ఎమోషనల్ ప్లాష్ బ్యాక్ కూడా ఉంటుందని.. కథ మొత్తం రాయలసీమ – కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.

ఇక ఈ కథలో ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగుంటాయట. ముఖ్యంగా వెన్నల కిశోర్ ట్రాక్ అదిరిపోతోందట. అలాగే బాలయ్య క్యారెక్టర్ లో బాగా వెటకారం ఉంటుందని, ఈ సినిమాలో బాలయ్య టైమింగ్ కూడా పూర్తిగా మారబోతుందని తెలుస్తోంది. మొత్తానికి బాలయ్య మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం బోయపాటి అఖండ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :