బాలయ్య-అనిల్ రావిపూడి మూవీలో విలన్‌గా స్టార్ హీరో?

Published on Jun 22, 2022 1:28 am IST

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో కూడా ఓ సినిమా చేయనున్నాడు. అయితే గోపీచంద్‌తో చేస్తున్న షూటింగ్ పూర్తవ్వకముందే అనిల్ రావిపూడి తన సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారనే వార్త వైరల్‌గా మారింది.

అయితే బాలకృష్ణ కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తుండగా, భార్యగా ప్రియమణి కనిపించనుందని సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఇందులో ఓ కీలక పాత్ర చేయడం కోసం అనిల్ రావిపూడి సీనియర్ హీరో రాజశేఖర్‌ను ఒప్పించాడట. ఇప్పటివరకు రాజశేఖర్ ఓ విలన్ పాత్ర చేయనున్నాడని టాక్ వినిపించినా.. ఇప్పుడు అది ఒక కామెడీ పాత్ర అని ప్రచారం సాగుతోంది. మొదటిసారి ఈ సినిమా కోసం రాజశేఖర్ సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పనున్నాడని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు చూడాలి.

సంబంధిత సమాచారం :