థ్రిల్లర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు రానున్న బాలయ్య !
Published on Jul 1, 2017 1:39 pm IST


థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న శమంతకమణి చిత్రం అందరిలోనూ క్యూరియాసిటీని కలిగిస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అంచనాలను పెంచే విధంగా ఉంది. కాగా ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జులై 3 న హైదరాబాద్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య అతిధి గా హాజరు కానున్నాడు.

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్,సందీప్ కిషన్, ఆది మరియు సుధీర్ బాబు లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో కీ రోల్ ప్లే చేయనున్నాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మణిశర్మ .

 
Like us on Facebook