ఆహా వీడియో కోసం స్పెషల్ టాక్ షో కి హోస్ట్ గా బాలయ్య

Published on Oct 5, 2021 5:40 pm IST


టాలీవుడ్ లో అగ్ర హీరోల్లో బాలయ్య స్థానం వేరే అని చెప్పాలి. అగ్రెసివ్ యాటిట్యూడ్ తో యాక్షన్ చేయడం, పవర్ ఫుల్ డైలాగ్స్ తో ప్రేక్షకులను అలరించడం తో పాటుగా కొన్ని దశాబ్దాలు గా తన వైవిధ్య నటన తో ఆకట్టుకుంటున్న బాలకృష్ణ ఇప్పుడు ఒక స్పెషల్ టాక్ షో కి వ్యాఖ్యాత గా వ్యవహరించనున్నారు. అయితే ఈ ఎనర్జిటిక్ టాక్ షో కి ఎంతో మంది సెలబ్రిటీ లు వచ్చే అవకాశం ఉంది. ఈ టాక్ షో ఆహా వీడియో ద్వారా ప్రేక్షకుల కు, అభిమానులకు అందుబాటులో కి రానుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. అయితే బాలకృష్ణ టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించనున్నారు అని తెలియడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను అలరిస్తుండగా, ఇప్పుడు బాబాయ్ రాకతో ఫ్యాన్స్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :