బాలకృష్ణకు దర్శకుడు దొరికేశాడన్నమాట ?

30th, November 2016 - 10:37:45 PM

krish-mokshagna
నందమూరి కుటుంబం నుండి సినీ తెరంగేట్రం చెయ్యవలసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ప్రస్తుతానికి ఒక్క బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ మాత్రమే. నందమూరి అభిమానులంతా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఆతురతగా ఎదురు చూస్తున్నారు. ఇంతకు మునుపు మోక్షజ్ఞ బాలయ్య 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో ఒక యువరాజు పాత్రలో కనిపిస్తాడని, అదే అతని స్క్రీన్ ఎంట్రీ అని అందరూ అన్నారు. కానీ అలాంటిదేమీ లేదని తేలిపోయింది. పైగా మోక్షజ్ఞను ప్రేక్షకులకు పరిచయం చేసే సరైన దర్శకుడు దొరక్క బాలకృష్ణ కూడా ఇన్నాళ్లు ఆలోచించారు.

కానీ ఇప్పుడు బాలకృష్ణకు ఆ లోటు తీరిపోయింది. ఎందుకంటే కుమారుడి పరిచయం చేయడానికి ఆయనకు సరైన దర్సకుడు దొరికాడని వార్తలోస్తున్నాయి. ఆ వార్తల ప్రకారం ఆ దర్శకుడు మరెవరో కాదు శాతకర్ణి దర్శకుడు క్రిష్. సినిమాకి పని చేసేటప్పుడు బాలకృష్ణకు క్రిష్ పనితీరు బాగా నచ్చి అతడైతే మోక్షజ్ఞ లాంచ్ బాగుంటుందని భావిస్తున్నారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్త ఎంత వరకు వాస్తవమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.