ఆయనతో అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవం – బాలయ్య

ఆయనతో అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవం – బాలయ్య

Published on Sep 11, 2022 9:59 PM IST

సీనియర్ నటుడు, నిర్మాత, రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి మరణం టాలీవుడ్ కి తీవ్ర దిగ్బ్రాంతికరం. ఈ విషాదకర సంఘటనను అభిమానులు, సినీ ప్రముఖులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక కృష్ణంరాజు గారితో తమకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు కొందరు సినీ ప్రముఖులు. ఈ క్రమంలో తాజాగా బాలయ్య కూడా కృష్ణంరాజుగారితో ఉన్న అనుబంధాన్ని తెలియజేసారు.

నంద‌మూరి బాల‌కృష్ణ ట్విట్ట‌ర్ ద్వారా సంతాప సందేశాన్ని షేర్ చేశారు. ‘‘మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజుగారి మరణం తీవ్రంగా కలిచివేసింది. సినీ, రాజకీయ రంగాలలో కృష్ణంరాజు గారిది చెరగని ముద్ర. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్‌గా శాశ్వత స్థానం సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు కృష్ణంరాజుగారు. కృష్ణంరాజుగారితో కలసి రెండు చిత్రాలలో నటించడం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవం. కృష్ణంరాజుగారితో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. కృష్ణరాజుగారు అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నప్పుడు వెళ్లి కలిశాను. ఆయన ఆరోగ్యం గురించి తరచూ తెలుసుకునేవాడిని. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని అన్నారు నందమూరి బాలకృష్ణ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు