ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్ లకు బాలయ్య అభినందనలు …!

Published on Jul 7, 2022 11:30 pm IST

తాజాగా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకి మొత్తం నలుగురు నామినేట్ అయిన విషయం తెలిసిందే. నిన్న విజయేంద్రప్రసాద్, ఇళయరాజా, పిటి ఉష, వీరేంద్ర హెగ్డే ల పేర్లు కేంద్రప్రభుత్వం పేర్లు ప్రకటించింది. భారత ప్రధాని నరేంద్రమోడీ వారందరికీ అభినందనలు తెలియచేసారు. ఇక ఈ నలుగురు కూడా దక్షిణాది వారు కావడం, అలానే అందులో ఇద్దరు సినిమా పరిశ్రమకి చెందిన వారు ఉండడంతో పలువురు సినిమా ప్రముఖులు వారిని అభినందిస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా నటుడు నందమూరి బాలకృష్ణ, ఒక ప్రెస్ నోట్ ద్వారా ప్రత్యేకంగా ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్ లకు అభినందనలు తెలియచేశారు. తెలుగు చిత్ర సీమతో ఎనలేని అనుబంధం కలిగిన ఇళయరాజా, విజయేంద్రప్రసాద్ ఇద్దరూ కూడా ఎంతో గొప్ప ఖ్యాతిని గడించారని, తెలుగు సినిమా కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన ఘనత విజయేంద్రప్రసాద్ కి దక్కితే, తన సుస్వరాలతో తెలుగు వారికే కాక దక్షిణాదిలో కోట్లాదిమంది సంగీతాభిమానులకు వీనులవిందు చేస్తున్న ఇళయరాజాలకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం సముచితమైన నిర్ణయమన్న బాలకృష్ణ, వారిని ఎంపిక చేసినందకు కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత సమాచారం :