ఇంటర్వ్యూ : సి. కళ్యాణ్ – బాలక్రిష్ణ యంగ్ హీరోలు వేసే స్టెప్స్ వేశారు !

4th, January 2018 - 12:48:33 PM

ప్రముఖహ్ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘జై సింహ’. ఈ నెల 12న చిత్రం రిలీజ్ సందర్బంగా ఏర్పాటు చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) కళ్యాణ్ గారు ‘జై సింహ’ రిలీజ్ పనులు ఎంతవరకు వచ్చాయి ?
జ) దాదాపు అన్నీ పూర్తైనట్టే. ఈరోజు సినిమా సెన్సార్ కు వెళ్లనుంది. సాయంత్రం పూర్తైపోతుంది.

ప్ర) మీ హీరో బాలక్రిష్ణ గురించి చెప్పండి ?
జ) నిజంగా బాలకృష్ణకు థ్యాంక్స్ చెప్పాలి. చాలా బాగా సహకరించారు. ఆయన వలనే సినిమా అనుకున్నట్టు పూర్తైంది.

ప్ర) సినిమాలో ముఖ్యమైన పాత్రలు ఏవేం ఉంటాయి ?
జ) సినిమాలో బాలక్రిష్ణతో పాటు నయనతార, ప్రకాష్ రాజ్, హరిప్రియల పాత్రలు చాలా కీలకం. సినిమా చూసిన తర్వాత వారి నటన, పాత్రలు గుర్తుండిపోతాయి.

ప్ర) బాలక్రిష్ణ, నయనతారల కెమిస్ట్రీ గురించి ?
జ) వాళ్ళిద్దరిదీ సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఈసారి కూడా సక్సెస్ అవుతుంది. నయనతారకు అసలు డేట్స్ లేవు. ముందు కుదరదు అన్నారు. కానీ కథ వినగానే ఓకే చెప్పి డేట్స్ అడ్జెస్ట్ చేశారు. వారిద్దరి ట్రాక్ ఆడవాళ్లకే కాకుండా మగవాళ్లకు కూడా ఎంతగానో నచ్చుతుంది.

ప్ర) కె.ఎస్. రవికుమార్ గారి వర్క్ ఎలా ఉంది ?
జ) చాలా బాగా చేశారు. ముందుగా అనుకున్నట్టే సినిమాను తీశారు. ఈ సినిమాతో ఆయన మరోసారి ప్రూవ్ చేసుకుంటారు.

ప్ర) సినిమాకి అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అయినట్టుంది ?
జ) అవును. ముందే ఎక్కువ ఖర్చు పెడదాం అనుకున్నాం. కానీ అనుకున్నదానికంటే ఎక్కువే పెట్టాల్సి వచ్చింది. ఔట్ ఫుట్ కూడా అంతే బాగా వచ్చింది.

ప్ర) సంక్రాంతికి ఇంకొన్ని సినిమాలు వస్తున్నాయి కదా ఆ పోటీని ఎలా తట్టుకుంటారు ?
జ) అవును పోటీ ఉంది. కానీ సినిమాకు ఆ పోటీలో నిలబడే సత్తా ఉంది. చిత్రం ఫుల్ లెంగ్త్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్. తప్పక అందరికీ నచ్చుతుంది.

ప్ర) సినిమాలో బాలక్రిష్ణగారి డ్యాన్సుల గురించి చెప్పండి ?
జ) నిజంగా ఈ విషయంలో అయనకు హ్యాట్సాఫ్ చెప్పాలి. నేను వద్దన్నా కూడా కాదని ఎన్నో కష్టమైన మూమెంట్స్ చేశారు. బన్నీ, చరణ్ లాంటి యంగ్ హీరోలు వేసే స్టెప్స్ వేశారు.

ప్ర) సినిమాలో హైలెట్ అంశాలేంటి ?
జ) కుంభకోణంలో ఒక ఎపిసోడ్ తీశాం. అందులో 2000 మంది పురోహితులు నటించారు. ఆ ఎపిసోడ్ చాలా బాగా వచ్చింది. సినిమాకున్న హైలెట్స్ లో అది కూడా ఒకటి. అలాగే వైజాగ్లో జరిగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇంకా మేజర్ హైలెట్. ఇక క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే అందరూ లేచి చప్పట్లు కొట్టేలా ఉంటుంది.

ప్ర) మీ నెక్స్ట్ సినిమాల గురించి చెప్పండి ?
జ) ప్రస్తుతం ధరమ్ తేజ, వినాయక్ ల ‘ఇంటెలిజెంట్’ షూట్ జరుగుతోంది. ఫిబ్రవరి 9న రిలీజవుతుంది. అలాగే రానాతో కలిసి ‘1945’ అనే సినిమా చేస్తున్నాను.