సినిమా విషయంలో బాలకృష్ణ డెడికేషన్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వేరియేషన్ చూపించాలని తపిస్తుంటారాయన. ఆ తపన, డెడికేషన్ మూలంగానే బోయపాటితో చేయనున్న సినిమాలో బాడీ వేరియేషన్ చూపాలనుకుంటున్నారు. అందుకే ప్రతిరోజు గంటలబడి వర్కవుట్స్ చేస్తున్నారట.
ప్రత్యేకంగా ఫిట్నెస్ నిపుణుడ్ని నియమించుకుని డైట్ కంట్రోల్ పాటిస్తున్నారు. సినిమా మొదలయ్యేనాటికి సుమారు 10 కిలోల వరకు తగ్గాలనేది టార్గెట్. సినిమాలో బాలయ్య లుక్ పూర్తిగా భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు బోయపాటి. అందుకోసం నవంబర్ నెలలో లుక్ టెస్ట్ చేయనున్నారు. మరి ఆ కొత్త లుక్ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.
డిసెంబర్ నెల నుండి సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్నారు. ఇది కూడా ‘సింహ, లెజెండ్’ తరహాలోనే హెవీ యాక్షన్ ఎంటెర్టైనర్ అని తెలుస్తోంది.
