అన్‌స్టాపబుల్: తప్పుడు ప్రచారం చేశారంటూ బాలయ్య భావోద్వేగం..!

Published on Dec 6, 2021 11:03 pm IST


నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్‌ చిత్రం “అఖండ”. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చుకుని కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. ఇదిలాఉంటే ఆహాలో బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోకి అఖండ చిత్ర బృందం హాజరైంది. ఈ షో నాలుగో ఎపిసోడ్‌కి దర్శకుడు బోయపాటి, శ్రీకాంత్‌, ప్రగ్యా జైస్వాల్‌, సంగీత దర్శకుడు థమన్ విచ్చేయగా బాలయ్య వారితో అల్లరి చేశారు. ఈ ఎపిసోడ్‌ ప్రోమో విడుదలైంది.

ఇందులో ప్రగ్యా బాలకృష్ణను సార్ అని పిలవగానే.. బాలయ్య ‘సార్’ ఏంటి అనగానే వెంటనే ప్రగ్యా ‘బాలా’ అని పిలవటం సరదాగా అనిపించింది. శ్రీకాంత్ అఖండలోని ఓ డైలాగ్ చెప్పగా, వెంటనే బాలయ్య తనదైన మాస్ స్టైల్‌లో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇక నేను విలన్‌గా నటించేందుకు రెడీగా ఉన్నానని, కానీ హీరో కూడా నేనేనని షరతు పెట్టడం బాగుంది. ‘మీరు ప్రపంచానికి ప్రశ్నేమో నాకు మాత్రం సమాధానం’ అని బోయపాటి బాలయ్యను ఉద్దేశించి చెప్పడం గూస్‌బంప్స్ తెప్పించేలా అనిపించింది. ఇక తన తండ్రి ఎన్టీఆర్‌ గురించి మాట్లాడుతూ వెన్నుపోటు అంటూ తప్పుడు ప్రచారం చేశారని, చెప్తుంటే కళ్లలో నీళ్లొస్తాయని, ఎందుకంటే నేను ఆయన కొడుకుల్లో ఒకడిని, ఆయన ఫ్యాన్స్‌లో ఒకడినని భావోద్వేగానికి గురయ్యాడు. డిసెంబర్ 10న ఈ ఫుల్ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :