బాలకృష్ణ ఆ విషయంలో ఫ్రస్టేట్ అవుతున్నాడా?

Published on Sep 8, 2021 3:00 am IST


నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం “అఖండ”. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల తేదిని ఖరారు చేసుకునే పనిలో ఉంది. అయితే ఏపీలో ఇంకా టికెట్ల ధరలు కొలిక్కి రాకపోవడంతో ఈ విషయంలో బాలయ్య కాస్త నిరాశగా ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే సినీ పరిశ్రమ కష్టాలు, టికెట్ల ధరలు వంటి అంశాలపై మాట్లాడేందుకు మెగస్టార్ చిరంజీవిని ఏపీ సీఎం జగన్ కలవమని కోరారు. కానీ ఈ భేటీ ఎప్పుడన్నది ఇంకా అధికారికంగా చెప్పలేదు. అయితే తన సినిమాల రిలీజ్ డేట్ విషయంలో జ్యోతిష్యశాస్త్రాన్ని నమ్మే బాలయ్య ఈ సినిమా విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నాడట. ఇదిలా ఉంటే త్వరలోనే బాలయ్య గోపీచంద్ మలినేనితో తన కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నారు.

సంబంధిత సమాచారం :