గుడ్ న్యూస్ : కరోనా నుండి కోలుకున్న బాలకృష్ణ …. షూటింగ్ లో ఎప్పుడు జాయిన్ అవుతున్నారంటే … ?

గుడ్ న్యూస్ : కరోనా నుండి కోలుకున్న బాలకృష్ణ …. షూటింగ్ లో ఎప్పుడు జాయిన్ అవుతున్నారంటే … ?

Published on Jun 29, 2022 11:22 PM IST

నందమూరి బాలకృష్ణ తో ప్రస్తుతం యంగ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని లేటెస్ట్ గా ఒక మూవీ తీస్తున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ కెరీర్ 107 మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల నాయిక శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ దీనిని ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ షూట్ మొన్న సడన్ గా ఆగిపోయింది. దానికి కారణం హీరో బాలకృష్ణ ఒక్కసారిగా కరోనా బారిన పడడమే.

అయితే అప్పటి నుండి డాక్టర్ల సూచనలు పాటిస్తూ హోమ్ ఐసోలేషన్ లో ఉన్న బాలకృష్ణ కు నేడు నెగటివ్ రిపోర్ట్ రావడంతో ఆయన పూర్తిగా కోలుకున్నట్లు డాక్టర్లు చెప్తున్నారు.ఇక వచ్చేవారం నుండి ఆయన తన లేటెస్ట్ మూవీ షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. పక్కా మాస్ యాక్షన్ తో కూడిన కమర్షియల్ మూవీగా దర్శకుడు గోపీచంద్ ఎంతో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా కన్నడ నటుడు దునియా విజయ్ ఇందులో విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ సూపర్ రెస్పాన్స్ అందుకుని మూవీపై అందరిలో బాగా అంచనాలు ఏర్పరిచింది. ఈ మూవీ అన్ని కార్యక్రమాలు ముగించుకుని డిసెంబర్ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు