ఇకపై రెండో ఇన్నింగ్స్ చూపిస్తా – బాలయ్య

ఇకపై రెండో ఇన్నింగ్స్ చూపిస్తా – బాలయ్య

Published on Jan 11, 2025 2:03 AM IST

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలయ్య పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి రిలీజ్ ట్రైలర్‌ను తాజాగా లాంచ్ చేశారు మేకర్స్. దీనికి సంబంధించిన ఈవెంట్‌లో బాలకృష్ణ కొన్ని సాలిడ్ స్టేట్మెంట్స్ చేశారు.

‘డాకు మహారాజ్’ మూవీ అందరికీ నచ్చేలా తీశామని ఆయన తెలిపారు. ఇక ‘అఖండ 2’ షూటింగ్‌ను మొదలుపెట్టామని.. ఇకపై తన రెండో ఇన్నింగ్స్ చూపిస్తానని బాలయ్య తెలిపారు. ‘అఖండ 2’ తర్వాత తానేంటో అందరికీ చూపిస్తానని.. రెండో ఇన్నింగ్స్ అంటే స్టార్‌డమ్ తగ్గాక మొదలుపెట్టేది కాదని.. తనకు అలాంటిది వర్తించదని బాలయ్య చెప్పుకొచ్చాడు.

ఏదేమైనా ‘డాకు మహారజ్’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో తెరకెక్కిందని.. ఈ సినిమాతో బాలకృష్ణ మరోసారి తనదైన మార్క్ వేయడం ఖాయమని మేకర్స్ చెబుతున్నారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌటేలా, చాందిని చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను జనవరి 12న గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు