వైరల్ అవుతోన్న బాలయ్య లవ్లీ వీడియో!

Published on Dec 3, 2021 11:30 am IST

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం విడుదల తో థియేటర్లు మళ్ళీ హౌజ్ ఫుల్ అవుతున్నాయి. బాలయ్య మరొకసారి తన మాస్ నట విశ్వ రూపం చూపించడం తో అభిమానులు, ప్రేక్షకులు థియేటర్ల కి క్యూ కడుతున్నారు.

తాజాగా బాలకృష్ణ కి సంబందించిన ఒక లవ్లీ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. చిన్న పాప తో బాలకృష్ణ ప్రేమగా ఉన్న వీడియో అభిమానులను ఆకట్టుకుంటుంది. అఖండ చిత్రం షూటింగ్ సమయం లో ఈ వీడియో తీసినట్లు తెలుస్తుంది. అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతం థమన్ అందించారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా, జగపతి బాబు, శ్రీకాంత్ లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :