మాస్ ప్రేక్షకుల కోసం బాలయ్య స్పెషల్ ప్లాన్స్ !

3rd, May 2017 - 09:14:22 AM


సాధారణంగా బాలకృష్ణ సినిమా అంటే మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటిది. పవర్ ఫుల్ డైలాగులు, భీభత్సమైన ఫైట్లు, అదరగొట్టే డ్యాన్సులు ఇలా బి, సి సెంటర్ల ఆడియన్సుకు కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా దొరుకుతాయి. వీటన్నింటిలోకి ఫాస్ట్ బీట్ పాటలకు బాలకృష్ణ వేసే స్టెప్పులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. హై ఎనర్జీ లెవెల్స్ తో స్క్రీన్ మీద ఆయన స్టెప్పులు వేస్తుంటే అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే బాలకృష్ణ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేస్తున్న తన సినిమాలో అదిరిపోయే డ్యాన్సులు ఉండేలా చూసుకుంటున్నారట.

ప్రస్తుతం ఒక మాస్ పాటను హైదరాబాద్ శివార్లలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేస్తున్నారట. ఈ పాటలో బాలకృష్ణ వేయబోయే స్టెప్పులో ఫ్యాన్సుకు కనువిందు చేసే విధంగా ఉంటాయని టాక్. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణను ఇదివరకెప్పుడూ కనిపించనంత కొత్తగా చూపిస్తారట పూరి. ఇకపోతే ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియ శరన్ హీరోయిన్ గా నటిస్తోంది.