బాలయ్య-గోపీచంద్ మూవీకి ముహూర్తం ఫిక్స్..!

Published on Nov 10, 2021 11:10 pm IST


నంద‌మూరి బాల‌కృష్ణ, గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎన్‌బీకే 107 ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ సినిమా గురుంచి తాజాగా మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు. న‌వంబ‌ర్ 13న ఉద‌యం 10:26 గంట‌ల‌కు గ్రాండ్‌గా ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టు తెలిపారు.

రాయ‌లసీమ బ్యాక్‌డ్రాప్‌లో జ‌రిగిన వాస్తవ‌ ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ఈ సినిమాను తెరక్కిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ మూవీలో బాలయ్య సరసన శృతిహాస‌న్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. అఖండ‌ మూవీకి మ్యూజిక్ అందిస్తున్న థ‌మ‌న్ మ‌రోసారి ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేయబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్‌గా కన్నడ స్టార్ దునియా విజ‌య్‌ని తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తుండగా,దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More