ఫేస్‌బుక్ వేదికగా మహేశ్‌బాబుపై బాలయ్య ప్రశంసలు ..!

ఫేస్‌బుక్ వేదికగా మహేశ్‌బాబుపై బాలయ్య ప్రశంసలు ..!

Published on Jan 23, 2022 3:00 AM IST


సూపర్ స్టార్ మహేశ్ బాబుపై నందమూరి బాలకృష్ణ ప్రశంసలు కురిపించాడు. అద్భుతమైన నటుడు.. అంతకన్న అద్భుతమైన మనసు మన సూపర్ స్టార్ మహేశ్‌ది అని బాలయ్య అన్నాడు. అయితే ఇదంతా దేనిని ఉద్దేశించి అన్నాడంటే బాలకృష్ణ ఆహాలో వచ్చే “అన్‌స్టాపబుల్” షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 9 ఎపిసోడ్‌లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు గ్రాండ్‌ ఫినాలేలోకి అడుగుపెట్టింది. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు చివరి ఎపిసోడ్‌లో సందడి చేయబోతున్నాడు. అయితే ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోని నిన్న ఆహా విడుదల చేసింది.

అయితే ప్రోమోలో వెయ్యికి పైగా చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయించి ఎంతో మంది పేదల గుండెల్లో నిలిచిపోయాడు మహేశ్ అని బాలయ్య చెప్పగా, దాని వెనుక ఉన్న అసలు కారణాన్ని మహేశ్ చెప్పాడు. తన కుమారుడు గౌతమ్ ఆరువారాల ముందే పుట్టాడని, పుట్టినప్పుడు కేవలం అరచేయి అంతే ఉన్నాడని, తన దగ్గర డబ్బు ఉండడంతో వైద్యం చేయించుకున్నామని, లేని వాళ్ల పరిస్థితి ఏమిటి అని అప్పుడు అనిపించిందని, అందుకే చిన్నారుల కోసం ఏదైనా చేయాలని తన వంతు సాయం చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ అంశం ఎంతో మంది హృదయాలను టచ్ చేసింది. ఇదిలా ఉంటే ఈ ప్రోమోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండగా, ఈ ఫుల్ ఎపిసోడ్ చూడాలంటే ఫిబ్రవరి 4 వరకు వేచిచూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు